నాణ్యతమైన విద్యను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాష్ట్ర ఎక్సైజ్ &పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నాణ్యతమైన విద్యను అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం రాష్ట్ర ఎక్సైజ్ &పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలోని ఎల్లమ్మ బండల దెగ్గర యంగ్ ఇండియా
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు లతో కలసి భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియతో మాట్లాడుతూ ..
రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉపాధి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నెలకొల్పుతున్నట్లు తెలిపారు.. పేద విద్యార్థులకు ఇది వరం లాంటిదని, పేదల పిల్లలు పెద్ద చదువులు చదవాలనే మంచి ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మరియు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలియజేశారు.విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.. కామారెడ్డి జిల్లాలో మొదటగా జుక్కల్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తాపత్రయం, కృషిని మంత్రి అభినందించారు..ఉన్నత విద్యావంతుడు అయిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వెనుకబడిన జుక్కల్ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు..

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా