బంగారుపాళ్యం నవంబర్ 19 మన ద్యాస
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నలసిద్ధనపల్లి గ్రామంలో బుధవారం రాత్రి అయ్యప్పస్వామి మాల ధరించిన స్వాములు ఏర్పాటు చేసిన పడి పూజ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ముందుగా కె.జి.సత్రం వద్ద టిడిపి నాయకులు గజమాల వేసి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి పడి పూజలలో పాల్గొన్నారు.అయ్యప్పస్వాములు అయ్యప్పస్వామి పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో స్వామివారిని కొలిచారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ ఎన్.పి.ధరణి ప్రసాద్,ఉపాధ్యక్షుడు లోకేష్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి మహేంద్ర, రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి కుప్పాల.మురళి,విజయం విద్యా సంస్థలు చైర్మన్ తేజోమూర్తి,శైలజ,ఏ.రవి,డి.నాగరాజ,వెంకటేష్,కల్లూరుపల్లి వేణుగోపాల్,కుమారస్వామి,రమేష్,జయశంకర్,పాళ్యం సుధ,దుద్దుకురు గిరి,జగదీశ్,సతీష్,గ్రామస్తులు, టిడిపి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







