మన ధ్యాస,నిజాంసాగర్, ( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ఎంపీడీవో శివకృష్ణ ముగ్గు పోసి పనులను ప్రారంభించారు.అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులు సకాలంలో ఇండ్లను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీవో అనితరెడ్డి,గ్రామపంచాయతీ కార్యదర్శి రమ్యశ్రీ,మంగ్లూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు చాకలి సాయిలు,నాయకులు ఆగమయ్య, బద్రి,దత్తు,తదితరులు ఉన్నారు.








