గత పాలకుల నిర్లక్ష్యంతో ఐదు లక్షలు మున్సిపాలిటీకి వృదా
మనద్యాస సాలూరు నవంబర్ 16:- గత పాలకుల నిర్లక్ష్యంతో కట్టించిన డివైడర్ వల్ల వాహన చోదకులకు శాపంగా మారింది. పట్టణ నడిబొడ్డులో ఉన్న డివైడర్ వల్ల వాహన చోదకులకు దినదిన గండంగా మారిందనడానికి నిత్యం యాక్సిడెంట్లు జరగడమే ఇందుకు సాక్షిభూతంగా నిలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే గత పాలకులు మిగిలి ఉన్న మున్సిపల్ నిధులు ఎలాగైనా ఖర్చు పెట్టాలన్న ఉద్దేశంతో మున్సిపల్ కార్యాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు నేషనల్ హైవే మధ్యలో డివైడర్ నిర్మించారు. వాస్తవానికి నేషనల్ హైవే లో డివైడర్ నిర్మించాలంటే హైవే అధికారుల వద్ద పరమతులు తప్పనిసరిగా తీసుకోవాల్సివుంది. అయితే గత పాలకులు నేషనల్ హైవే అధికారుల వద్ద ఎటువంటి అనుమతులు తీసుకోకుండా డబ్బులు వృధా చేయ్యడానికి కంకణం కొట్టుకోవడానికే అన్నట్లు ప్రజాధనం ఐదు లక్షల వ్యయంతో తహసిల్దార్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మొండి డివైడర్లను నిర్మించారు. అయితే ఈ డివైడర్ల వల్ల ఒకవైపు ఆర్టీసీకి నష్టం జరుగుతుందని గతంలో ఆర్టీసీ డిపో మేనేజర్ పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అలాగే ప్రతిపక్ష నాయకుల సైతం ఈ డివైడర్ల విషయంలో మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎత్తి చూపించిన దాఖలాలు లేకపోలేదు. అలాగని ఆడవైడర్లు పటిష్టంగా కట్టించారంటే అది లేదు ఏదైనా చిన్న వెహికల్ గుద్దిందంటే పక్కకి ఒరుగి పోయే పరిస్థితి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అది అలా ఉంచితే ఈ డివైడర్లకు ముందుగానే వెనుకవైపు గాని ఎటువంటి నిబంధనలతో కూడిన ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల నిత్యం వాహన చోదకులు యాక్సిడెంట్లకు గురవుతూ లక్షల్లో చేరి చమురు వదిలించుకుంటున్నారని పలువురు బాధితులు లబోదిబోమంటున్నారు. చీకటి పడిందంటే చాలు ఒడిస్సా నుండి ఇటువైపు ఆంధ్రా నుండి కొత్తగా వచ్చిన వాహనాలు ఈ డివైడర్ బారిన పడక తప్పడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒడిస్సా కు చెందిన నలుగురు వ్యక్తులు ఖరీదైన కారులో తహసిల్దార్ కార్యాలయం దాటుతుండగా రోడ్డు మధ్యలో చిన్నగా కట్టించిన ఈ డివైడర్ను ఢీకొనడంతో కారు అక్కడికక్కడే ఆగిపోయింది. చుట్టుపక్కల ఉన్న బాటసారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కారుని పక్కకు తీయించారు. ఆ ఒడిస్సా కు చెందిన వ్యక్తులు అత్యవసర పనిమీద ఒడిస్సా కొరపుట్టు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇలాంటి సంఘటనలు వేళల్లో లెక్కబెట్టుకోవచ్చు. కొందరైతే అత్యవసర సమయాల్లో కారులో ఒరిస్సా నుండి వైజాగ్ వెళ్ళవలసిన వారు సైతం ఈ డివైడర్లను ఢీకొని సాలూరులోనే ఉండిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ డివైడర్ల విషయంలో జిల్లా అధికారులు స్పందించి డివైడర్లను తొలగించాలని బాధితులతో పాటు ప్రతిపక్ష నాయకులు కోరుతున్నారు.








