

మన న్యూస్: తిరుపతి, డిసెంబర్ 7 ఏర్పేడు మండలం మడిబాక గ్రామపంచాయతీ రాజులకండ్రిగ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాతింగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల ఉపాధ్యాయులఆత్మీయ సమావేశం శనివారం హెడ్ మాస్టర్ శ్రీరాములు ఉపాధ్యాయుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో టిడిపి క్లస్టర్ గుండ్రాజు మురళి, వార్డ్ మెంబర్ మధుసూదన్ రాజు టిడిపి సీనియర్ నాయకుడు కడివెల్ల సాంబశివరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సరస్వతి పూజ నిర్వహించి పూలమాలలు అలకరించారు. వార్డ్ మెంబర్ మధుసూదన్ రాజు మాట్లాడుతూ బాల్య దశ నుంచి క్రమశిక్షణతో విద్యను అభ్యశించాలన్నారు. టిడిపి సీనియర్ నాయకులు సాంబశివరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులతో ఏ సమస్య ఉన్న ప్రతి తల్లి తండ్రి సమస్యను ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొని పోవాలన్నారు. విద్యా కమిటీ చైర్మన్ మంజుల వైస్ చైర్మన్ సుభాషిని ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు గ్రామస్తులు విక్రమ రాజు, జగదాబి మునిశేఖర్ రాజు, గుండ్రాజ్ సుధాకర్ రాజు, రమణ రాజు, కడివెల్ల మునికృష్ణమరాజు,మేడిద చలమరాజు గెంజి.రవి యాదవ్, మోటుపల్లి సురేష్, గుండ్రాజు పరమానంద్ రాజు తల్లిదండ్రులు పాల్గొన్నారు.