మన ధ్యాస ,నెల్లూరు ,నవంబర్ 16 :నెల్లూరు కనుపర్తిపాడు సుబ్రహ్మణ్యం స్వామి దేవస్థానం నందు ఆదివారం నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం కార్యక్రమం కోలాహాలంగా జరిగింది. ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మంగళ వాయిద్యాలతో గణపతి పూజా కలశ స్థాపన కార్యక్రమం ప్రారంభించారు. గౌడ్ కులస్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందపరతమైన కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు నృత్య ప్రదర్శన ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గౌడ్ కులస్తులు మాట్లాడుతూ….. గౌడ్ కులస్తులు అన్ని రంగాల ముందుకు పోవాలని రాజకీయంగా, విద్యాపరంగా, వ్యాపారంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన గౌడ్ కులస్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం గౌడ్ కులస్తులు విందు భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి నరసింహ గౌడ్ ,గౌడ్ సంఘ వ్యవస్థాపకులు; అన్నం దయాకర్ గౌడ్ రాష్ట్ర గౌడ్ సంఘ అసోసియేట్ అధ్యక్షులు ;బుర్రా వెంకటేశ్వర్లు గౌడ్ సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ; దద్దోలు రమణయ్య గౌడ్ , గౌడ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ;నాశిన మల్లికార్జున గౌడ్ లిక్కర్ స్టేట్ డిస్టలీరీస్ ప్రెసిడెంట్ ;దాసరి భాస్కర్ గౌడ్ మనబోలు మాజీ జడ్పిటిసి ; మన్నెం చిరంజీవి గౌడ్ మాజీ జడ్పీటీసీ టీపీ గూడూరు; పండి ధనుంజయ రాష్ట్ర గౌడ్ రాష కార్పొరేషన్ డైరెక్టర్ ,మోర్ల సుప్రజ మురళి గౌడ్ మున్సిపల్ చైర్మన్ బుచ్చి, మారుపోయిన శ్రీనివాసులు గౌడ్ గౌడ్ సంఘ నాయకులు బిజెపి నాయకులు, కుడుమల ఈశ్వరయ్య గౌడ్ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డిపేట, ఉప్పల ఈశ్వరయ్య గౌడ్ మాజీ సర్పంచ్ కాకుపల్లి, నాయుడు రాంప్రసాద్ గౌడ్ కావలి మాజీ జెడ్పిటిసి, కోసూరు బాలయ్య గౌడ్ గౌడ్ సంఘ సీనియర్ నాయకులు , రావుల దశరధ రామయ్య గౌడ్ సంఘం మాజీ అధ్యక్షులు , దద్దోలు చక్రపాణి గౌడ్ గౌడ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, తిరకాల శ్రీనివాస్ గౌడ్ గౌడ్ సంఘ సీనియర్ నాయకులు, మన్నెం సుబ్రహ్మణ్యం గౌడ్ జై గౌడ్ ఉద్యమ సంఘ అధ్యక్షులు నెల్లూరు జిల్లా,రావుల వెంకటనారాయణ గౌడ్ పెంచలకోన గౌడ సత్రం అధ్యక్షులు, పండి పెనుకొండయ్య గౌడ కావలి డివిజన్ అధ్యక్షులు, రావుల చంద్రహాస శివాజీ గౌడ్ అమరాన్ బ్యాటరీస్ డిస్ట్రిబ్యూటర్స్, జానా నాగరాజు గౌడ్ కార్పొరేటర్ ఒకటవ వార్డ్, కోసూరు కేశవుల గౌడ్ సర్పంచ్ కాకుపల్లి ,ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారస్తులు వివిధ రంగాలలో చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.











