గంగాధర నెల్లూరు, మన ద్యాస నవంబర్-14:
గంగాధర నెల్లూరు మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు సాయంత్రం నాలుగున్నర గంటలకు నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్‌టీయూ) మండల శాఖ సమావేశంలో ఉపాధ్యాయుల పెద్ద ఎత్తున చేరిక జరిగింది. ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సమన్వయకర్త దేవరాజు రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో గంగాధర నెల్లూరు మండలానికి బదిలీపై చేరిన పెద్దబ్బ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, తంగరాజు, నరసింహులు, లక్ష్మీ ప్రసాద్, డింపుల్ కుమార్, ధర్మయ్య, శంకర్, మేగల, లిఖిత, పూర్ణిమ, చంద్రిక తదితరులు రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్‌టీయూ)లో సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంఘ బలపాటు, అభివృద్ధికి తమ వంతు సేవ అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.







