వింజమూరు నవంబర్ 14 : మన ధ్యాస న్యూస్:

వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ గ్రామానికి వెళ్లే మార్గంలో కంపచెట్లో వేపుగా పెరిగి దారిని కమ్మేయడంతో ఊటుకూరు సర్పంచ్ రోడ్డా వెంగమ్మ ఆధ్వర్యంలో జెసిబి ని ఏర్పాటు చేసి కంపచెట్లను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు ఉండడం వలన రాత్రివేళలో పాములు తిరుగుతూ ఉంటాయని గ్రామస్తులు సర్పంచ్ దృష్టికి తీసుకురాగా తక్షణ చర్యల్లో భాగంగా ఈరోజు మాజీ ఎంపీటీసీ సభ్యులు రోడ్డా కొండయ్య దగ్గరుండి చెట్లను తొలగించారు. గ్రామపంచాయతీలో ఏ సమస్యలు నెలకొన్న తక్షణమే పరిష్కార దిశగా అడుగులు వేస్తూ పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తున్న సర్పంచ్ గారికి పంచాయతీ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఎప్పటికప్పుడు వీధిలైట్లు, మంచినీటి సౌకర్యం, పారిశుధ్యం పై దృష్టి పెడుతూ ఒక మంచి మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దే దిశగా నిరంతరం పనిచేస్తూ ఉండడం సంతోషకరం అని గ్రామస్తులు తెలిపారు.నిత్యం ప్రజా సమస్యల పై దృష్టి పెడుతూ గ్రామభివృద్ధికి తొడ్పాటునివ్వడంతో గ్రామస్తులు హర్షతేరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాల దాటికి జువ్విగుంటపాలెం దగ్గర లోతట్టు ప్రాంతంలో నీరు నిలబడి, దారి లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో పంచాయతీ కార్యదర్శి పెంచలయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యులు కొండయ్య చొరవతో గ్రావెల్ తోలి చదను చేయడం జరిగింది. ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్న తక్షణమే స్పందిస్తూ గ్రామ స్వచ్ఛతకు శ్రీకారం చూడుతున్నారు.









