కావలి నవంబర్ 14 మన ధ్యాస :।।
కావలి పట్టణంలో ఆపద్భాందవ సేవా ట్రస్ట్ వారు సమాజం పట్ల అంకితభావంతో మన వంతుగా ఎంతోకొంత సహాయం చేయాలని పేదల కోసం ప్రతిరోజు ఒక్కరికైనా కడుపు నింపాలని సదుద్దేశంతో ఐదు సంవత్సరాల నుంచి స్వంత ఖర్చులతో మరియు దాతలు ఆర్థిక సహాయ సహకారంతో ఆకలితో ఉన్నవారికి, మతిస్థిమితం లేని వారికి ప్రతిరోజు అన్నదాన సేవ కార్యక్రమం చేయడం జరుగింది.అదేవిదంగా మధు వృద్ధాశ్రమం తెట్టు గ్రామం, దర్గా దగ్గర, గుడ్లూరు మండలం,శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందు నూతనంగా వృద్ధాశ్రమం ఏర్పాటు చేయటం జరిగింది.చక్కని పల్లెటూరు వాతావరణం, చల్లని గాలి, విశాలామైన చెట్లు, వేడి నీళ్లు, టీవీ, కేర్ టేకర్,24 గంటలు ఆర్.ఎం.పి డాక్టర్ పర్యవేక్షణ లో ఏర్పాటు చేయడమైనది.కాబట్టి ఎవరైనా నిరాశ్రాయులైన వృద్ధులు, వితంతువులు,ఇంటిలో చూసుకోవటానికి వసతి లేక గాని లేదా విదేశాల్లో ఉండే ఇక్కడ వారి తల్లిదండ్రులని చూసుకోలేకపోతున్నామని చింతిస్తున్న వారికి మా మధు వృద్ధాశ్రమంలో చక్కగా టైంకి అల్పాహారం,భోజనం ఏర్పాటు చేసి సొంత కన్న తల్లిదండ్రుల్లాగా చూస్తామని తెలుపుటకు మిక్కిలి సంతోషంగా ఉంది. మంచంలో ఉన్నవారికి డైపర్స్ మార్చుట, స్నానం చేపించడం, టైం కి మందులు వేయడం చేయబడును.కాబట్టి ఎవరైనా మీరు వృద్ధాప్యంలో ఉన్న వారిని కొన్ని అనివార్య కారణాలవల్ల చూడలేకపోతున్నామని బాధపడకుండా మా మధు వృద్ధాశ్రమాన్ని సందర్శిస్తే మీరు ఏ విధంగా మీ వారిని చూడాలని అనుకున్నారో అదే విధంగా మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వారిని కంటికి రెప్పలాగా చూసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వయోవృద్ధులు వారి పని వారు చేసుకున్న వారు గాని చేసుకోలేనివారు గాని ఆసక్తి ఉన్నవారు ఎవరైనా మీరు 7093871968,9951634098 నెంబర్లు ని సంప్రదించగలరని అని తెలిపారు.









