జలదంకి, నవంబర్ 13 :మన ధ్యాస న్యూస్ ://
జలదంకి మండలం సోమవరపాడు గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన కొల్లుబోయిన వెంకటేశ్వర్లు యాదవ్ ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ కి మండల పార్టీ అధ్యక్షులు మొనగాల తిరుమలరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆశీస్సులతో పార్టీ నాయకత్వం నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ముఖ్యంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మార్గదర్శకత్వంలో పార్టీ కార్యక్రమాలను సోమవరపాడు గ్రామంలో మరింత బలోపేతం చేస్తానని ఆయన తెలియజేశారు. పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ గ్రామీణ స్థాయికి చేర్చే దిశగా కృషి చేస్తానని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి పునాది అయిన కార్యకర్తల అంకితభావం మండల నాయకుల అంకిత భావం వల్లే నాకు ఈ పదవి దక్కిందని.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు మండల స్థాయి నాయకులకు అండగా నిలుస్తూ అభివృద్ధి-సంక్షేమ పథకాల నువ్వు ప్రజల్లోకి తీసుకొని పోతు పార్టీని బలపరిచే దానికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన అన్నారు. సోమవరప్పాడు గ్రామంలో పార్టీని మరింత బలపరిచే దానికి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కట్టుబడి ఉంటానన్నారు. ఎమ్మెల్యే చూపుతున్న ప్రజా అనుకూల పాలన దిశగా అడుగులు వేస్తూ ఆయన అభివృద్ధి దృష్టి కోణాన్ని ప్రతి గ్రామానికి చేర్చడమే మా లక్ష్యం అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం తో పాటు సోమవరపాడు గ్రామ ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ చేతుల మీదగా అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జలదంకి మండల సీనియర్ నాయకులు.. కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.









