మన ధ్యాస, విజయవాడ, నవంబర్ 12: భారతదేశంలోని ప్రముఖ సాధారణ బీమా సంస్థలలో ఒకటైన టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, కంపెనీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సంస్థలు, స్టార్టప్‌లు, ఎమ్ ఎస్‌ఎమ్‌ఇలను పెరుగుతున్న సైబర్ దాడులు, డేటా ఉల్లంఘనల ముప్పు నుంచి రక్షించడానికి రూపొందించిన సమగ్ర సైబర్ బీమా పరిష్కారమైన సైబర్ ఎడ్జ్‌ను ప్రారంభించినట్లు నేడు ప్రకటించింది. రాబోయే మూడు సంవత్సరాలలో సైబర్ బీమా పోర్ట్‌ఫోలియో తమ మొత్తం ఫైనాన్షియల్ ప్రీమియంలో దాదాపు 25% వాటాను అందిస్తుందని టాటా ఏఐజీ ఆశిస్తోంది. అదే సమయంలో ఈ ప్రాంతంలో 2 రెట్ల వ్యాపార వృద్ధిని సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.తమ ఫైనాన్షియల్ లైన్స్ పరిధిలో ఈ ఎదుగుదల వృద్ధి బలమైన ఎంటర్‌ప్రైజ్ లను కలుపుకోవడం ద్వారా సాధ్యం కానుంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలోని ఐటీ పారిశ్రామిక క్లస్టర్‌లలో పెరుగుతున్న సైబర్ సంసిద్ధత ఈ ధోరణికి మరింత మద్దతు ఇస్తోంది. పరిశ్రమ నివేదికలు గణాంకాల ప్రకారం, సైబర్ నేరాలలో ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కలిపి భారతదేశంలో రెండవ స్థానంలో ఉన్నాయి. గత 2024లో రెండు రాష్ట్రాలు 6.2 మిలియన్లకు పైగా మాల్వేర్ గుర్తింపులు, 17,500 రాన్సమ్‌వేర్ సంఘటనలను చవి చూశాయి, డేటా ఉల్లంఘన సగటు ఖర్చు రూ.19.5 కోట్లకు చేరుకుంది. ఇవి అత్యధికంగా లక్ష్యంగా చేసుకున్న రంగాలలో దక్షిణ భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఫార్మాస్యూటికల్స్, ఐటి/ఐటిఇఎస్, బిఎఫ్‌ఎస్‌ఐ, తయారీ రంగాలు ఉన్నాయి.300 సిఎక్స్‌ఓల నుంచి వచ్చిన సేకరించిన మూల్యాంకనాల ఆధారంగా, టాటా ఏఐజీ దాని నాలెడ్జ్ భాగస్వామి డన్ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియాతో కలిసి చేసిన పరిశోధన నివేదిక ‘ హారిజన్ వాచ్: ఎమర్జింగ్ రిస్క్ రిపోర్ట్’ ప్రకారం… అత్యాధునిక సాంకేతిక పురోగతినే సరికొత్త ప్రమాదాలకు ప్రధాన చోదకంగా 83% వ్యాపారాలు భావిస్తున్నాయని తేల్చింది.ఈ సందర్భంగా టాటాఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ లైన్స్, నేషనల్ హెడ్ – ఫైనాన్షియల్ లైన్స్, నజ్మ్ బిల్గ్రామి మాట్లాడుతూ ‘‘సైబర్ ముప్పు విస్త్రుతి అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. తెలంగాణ డిజిటల్‌గా బాగా చురుకైన ప్రాంతాలుగా ఉన్నాయి. అలాగే సైబర్ నేరాలకు కూడా అవి లక్ష్యంగా ఉన్నాయి. సైబర్ ఎడ్జ్‌తో, ఇక్కడి వ్యాపారాలు తమ రక్షణలను బలోపేతం చేసుకోవడానికి, వేగంగా స్పందించడానికి, చాకచక్యంగా కోలుకోవడానికి వీలు కల్పిస్తున్నాము. ఈ ఉత్పత్తి నష్టాలను భర్తీ చేయడానికి మాత్రమే కాకుండా, సంస్థలు నిజమైన సైబర్ స్థితిస్థాపకతను నిర్మించడంలో సహాయపడటానికి నిర్మించబడింది.’’ అని చెప్పారు.సైబర్ ఎడ్జ్ ఎండ్–టు–ఎండ్ ఆర్థిక కార్యాచరణ రక్షణను అందిస్తుంది ఫోరెన్సిక్ పరిశోధనలు, డేటా పునరుద్ధరణ, చట్టపరమైన మద్దతు, దోపిడీ నిర్వహణ వ్యాపార అంతరాయ నష్టాలను కవర్ చేస్తుంది.సైబర్ ఎడ్జ్ ముఖ్య ప్రయోజనాలు: ఫస్ట్ రెస్పాన్స్ కవర్: తొలి 24గంటలు చాలా కీలకం…ఏదైనా సంఘటన రిపోర్ట్ చేసిన 2గంటల్లోనే 24/7 x 365 అందుబాటులో ఉండే టాటా ఏఐజీ న్యాయ, ఐటీ ఫోరెన్సిస్ నిపుణుల బృందం..బ్రికింగ్ రికవరీ: సైబర్ దాడి కారణంగా డేటాను నిల్వ చేయడానికి ఉపయోగించే కంప్యూటర్ సిస్టమ్స్ దెబ్బతిన్న పరిస్థితుల్లో వాటి భర్తీ ఖర్చును కవర్ చేస్తుంది.నెట్‌వర్క్ నష్ట గణన: ఫోరెన్సిక్ అకౌంటింగ్ ఫీజుల కవరేజీతో సహా వ్యాపార అవసరాలకు అనుగుణంగా స్థూల లేదా నికర లాభ కవరేజీని ఎంచుకోగల సౌలభ్యం.విస్త్రుత కంప్యూటర్ సిస్టమ్ రక్షణ: బివైఓడి (బ్రింగ్ యువర్ ఓన్ డివైజ్)… ఆపరేషనల్ టెక్నాలజీస్, ఇండస్ట్రియల్ కంట్రోల్, స్కాడా సిస్టమ్‌లను కూడా కవర్ చేస్తుంది.








