నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన భోజన మహోత్సవం

మన ధ్యాస,నెల్లూరు, నవంబర్ 13: నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాన వన భోజన మహోత్సవం” నవంబర్ 16 ఆదివారం ఘనంగా నెల్లూరు పడారుపల్లిలో నిర్వహించబడనుంది బీసీ సంఘం సభ్యులు తెలియజేశారు. నెల్లూరు జిల్లా బీసీ సంఘం వారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరుల సమావేశం గురువారం నిర్వహించినారు . ఈ సందర్భంగా విట్టపు లలితా రామ్ యాదవ్ మాట్లాడుతూ……… ఈ సందర్భంగా బినీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం అందజేశారు.మహా జనసమ్మేళనంగా జరగబోయే ఈ కార్యక్రమానికి బీసీ కుటుంబానికి చెందిన సభ్యులు, స్నేహితులు, బంధువులు మరియు వారి కుటుంబాలు భారీగా హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో బిసి వర్గాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు , డాక్టర్లు, న్యాయవాదులు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు పాల్గొంటారు. ఈ వేడుకలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, పిల్లల ఆటలు, ఫ్యామిలీ గేమ్స్, వినోద కార్యక్రమాలు, వంట పోటీలు, వంటక ప్రదర్శనలు వంటి విశేష ఆకర్షణలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి భోజన ఏర్పాట్లు, నీటి సదుపాయాలు, సౌకర్యాలు సమృద్ధిగా కల్పించనున్నట్టు బీసీ సంఘం తెలిపింది. బీసీ కుటుంబ ఐక్యతను మరింత బలపరచే వేదికగా ఈ మహోత్సవం నిలవనుంది సంఘ సభ్యులు తెలిపారు . బిసి కుటుంబ ఐక్యతను ప్రపంచానికి చాటే ఈ వేడుకలో అందరూ ఒకటిగా కలసి బంధుత్వాన్ని పటిష్టం చేసుకోవాలని కుటుంబాల మధ్య అవగాహన, ప్రేమాభిమానాలు పెంపొందించుకునే అవకాశం ఈ వనభోజన కార్యక్రమం ద్వారా లభిస్తుందని పేర్కొన్నారు.సంఘం ఆధ్వర్యంలో పాల్గొనే విభాగాలుయువత సంఘం, గౌరవ సలహాదారులు, వైద్య విభాగం, ప్రచార విభాగం, సేవా విభాగం, మహిళా విభాగం, చిత్రలేఖన విభాగం, మ్యూజిక్ విభాగం, క్రీడా విభాగం, ఆహార వసతి విభాగం మొదలైన అనేక కమిటీలతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడనుంది.ఇంకా ఇతర సమాచారం కోసం ఈ నెంబర్లకుసంప్రదించవలసినదిగా కోరారు.9885039612, 7093191999, 9019888416, 9542406749,9959487039, 8106509251, 9959078040, 8121956355> బినీ కుటుంబ సభ్యులందరూ కార్యక్రమానికి విచ్చేసి, బినీ కుటుంబ ఐక్యతను చాటుదాం అని నెల్లూరు జిల్లా బీసీ సంఘం కమిటీ సభ్యులు కోరారు.ఈ పత్రిక విలేకరుల సమావేశంలో రావులపల్లి వెంకట జ్యోతి యాదవ్ ఎక్స్ కార్పొరేటర్ , మీసాల వెంకట కుమార్ యాదవ్, ఉడతా మురళి యాదవ్, పవన్ యాదవ్, లక్ష్మీ యాదవ్, సామా గోపాల్, శ్రీ కుమార్, కొణిదల నాగేంద్ర , రాము తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం