జుక్కల్ నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా ప్రతీ ఒక్కరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నదే తన ఆశయం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్,( జుక్కల్ ) మద్నూర్ మండల కేంద్రంలో గుడాల్వర్ సవిత ఇందిరమ్మ ఇళ్లును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇందిరమ్మ ఇల్లు లబ్దిదారురాలు గుడాల్వర్ సవిత ను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు వాస్తవ రూపం దాలుస్తున్నాయన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జుక్కల్ నియోజకవర్గానికి ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా మంజూరు కానీ విషయాన్ని గుర్తు చేశారు.అయితే ఇప్పుడు మన జుక్కల్ నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని,కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహప్రవేశం జరుగుతుండగా మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నట్లు తెలిపారు..పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందని అన్నారు.నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని చెప్పారు.జుక్కల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె కూడా లేకుండా ప్రతీ ఒక్కరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నదే తన ఆశయం అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పునరుద్ఘాటించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు,హౌసింగ్ శాఖ అధికారులు అందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు..

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం