కలిగిరి, నవంబర్ 07 (మన ద్యాస న్యూస్) ప్రతినిధి://
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామ సమీపం లో కావలి నుండి కలిగిరి వైపు బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు, అతివేగంగా వెళ్తు రోడ్డు పక్కన ఉన్న ప్రమాద హెచ్చరిక బోర్డు ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మనోజ్ 24 సంవత్సరాలు వయసు గల యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు.మరో ఇద్దరు మురారీ పెంచలప్రసాద్,నక్కా కిరణ్, లకు తీవ్ర గాయపడ్డారు,వీరి ముగ్గురు ది కలిగిరి మండలం జీర్రవారిపాలెం కి చెందిన వ్యక్తులు గా గుర్తించారు, గాయపడిన ఈ ఇద్దరిని వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు, అక్కడ నుండి నక్కా కిరణ్ కు బలమైన గాయాలు కాగా అతనిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కి తరలించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న కలిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చనిపోయిన వ్యక్తి ని పోస్ట్ మార్టమ్ కి ఆత్మకూరు కి తరలించారు.









