మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):పంచాయతీ కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ గ్రామంలో అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఎంపీడీవో శివకృష్ణ అన్నారు.నిజాంసాగర్ మండలంలోని మంగ్లూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీడీవో సందర్శించి,హాజరు రికార్డులు, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు.అనంతరం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లబ్ధిదారులు పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వెంటనే ప్రభుత్వం బిల్లులను సకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు.తాజాగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో శివకృష్ణకు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చాకలి సాయిలు శాలువాతో ఘన సత్కారం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ అనితా రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి రమ్యశ్రీ,తదితరులు ఉన్నారు.









