మన ధ్యాస, నిజాంసాగర్ ,( జుక్కల్ ) భక్తులకు కోరిన కోరికలను తీర్చి వెన్నంటి కష్టాలను తొలగించి ఆదివాసీల కలియుగ ప్రత్యక్ష దైవం భీమన్న దేవుడని నాయక్‌పోడ్ కులస్తులు అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భీమన్న దేవుడికి ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి నాయక్‌పోడ్ అందరూ కలసి ప్రతి ఇంటిలో బోనం ను అందంగా అలంకరించుకొని సాయంత్రం ప్రతి ఇంటి నుంచి బోనం ను మహిళలు ఎత్తుకొని బాజా భజంత్రీలతో నృత్యాలు చేస్తూ గుడి వద్దకు చేరుకొని గుడి చుట్టూ బోనాలను ఎత్తుకొని ప్రదక్షిణలు చేసి బోనాన్ని సమర్పిస్తారు.అనంతరం కులదైవానికి మంగళ హారతుల నడుమ భక్తి శ్రద్ధ్దలతో ఘనంగా నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా సంస్కృతి అధ్యక్షులు కొమ్ము రవికుమార్,కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మొట్ట పెంటయ్య,జిల్లా కోశాధికారి సాయిబాబా, శ్రీనివాస్,శంకర్,జాముల శంకర్,సాయిలు,బాలురాజు, సంజీవులు,టీ సాయిలు,కాశీరం, నారాయణ,తదితరులు పాల్గొన్నారు.









