పర్యావరణ మార్గదర్శకాలకు విరుద్ధంగా కార్యకలాపాలు – మైన్స్ శాఖ రూ.4 లక్షల జరిమానా
పాలసముద్రం మన ధ్యాస : గంగాధర నెల్లూరు నియోజకవర్గం బలిజ కండ్రిగ పంచాయతీ పరిధిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ రవాణాపై కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ మరియు మైన్స్ శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి రవాణాను నిలిపివేశారు.పర్యావరణ శాఖ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, తమిళనాడుకు అక్రమంగా గ్రావెల్ తరలింపులు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) వద్ద ఇప్పటికే కేసు నమోదు చేయబడినట్టు అధికారులు తెలిపారు.దర్యాప్తులో సుమారు 1098మెట్రిక్ టన్నుల అక్రమ గ్రావెల్ ఉన్నట్లు గుర్తించిన మైన్స్ శాఖ, సంబంధిత కాంట్రాక్టర్లపై రూ.4 లక్షల జరిమానా విధించి, ఖనిజ కార్యకలాపాలను తాత్కాలికంగా మూసివేసింది.అధికారుల హెచ్చరిక ప్రకారం, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించే వారు ఎవరైనా అయినా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఖనిజ వనరుల సంరక్షణ కోసం ఇలాంటి అక్రమ రవాణా చర్యలు తక్షణమే అరికట్టాలని కలెక్టర్ ఆదేశించారు.







