నవంబర్ 17న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఎమ్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.కే విశ్వనాథ్ మాదిగ..

నెల్లూరు, నవంబర్ 05 మన ధ్యాస ://

మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు.
నెల్లూరు నగరంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నందు విలేకర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు వైకే విశ్వనాథ్ మాట్లాడుతూ సీజే గవ్వాయ్ మీద జరిగిన దాడిని నిరసనగా నవంబర్ ఒకటో తారీఖున హైదరాబాద్ లో చేపట్టిన దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనను విజయవంతం చేసిన ప్రతి దళితులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అదేవిధంగా నవంబర్ 17వ తారీకు జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి ఒక్క దళితుడు నవంబర్ 17న ఢిల్లీకి తలలు రావాలని దేశంలో దళిత గిరిజనులకు మహా గ్రంధమైన రాజ్యాంగం అలాంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో పనిచేసే గవ్వాయ్ పైనే బూటుతో దాడి చేయడం అత్యంత దారుణమైన సంఘటన అలాంటి ఘటనకు కారకులైన వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం చాలా దారుణమని అదేవిధంగా నవంబర్ 17 జరగబోయే చలో ఢిల్లీ కూడా జయప్రదం చేయాలని తెలియజేశారు.
అలాగనే నెల్లూరు జిల్లా డీఎంహెచ్ఓ గారిని కలిసి గత పది సంవత్సరాలుగా ఎస్సీ మాదిగ మేల్ హెల్త్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి జరిగినటువంటి అన్యాయం గురించి చర్చించి వారికి వెంటనే రెగ్యులర్ విధులకు ఆర్డర్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు డి ఎమ్ హెచ్ ఓ ఆఫీస్ నెల్లూరు లో హెల్త్ అసిస్టెంట పెడుతున్నటువంటి అనేక ఇబ్బందులు గురించి దాదాపు రెండు గంటల పాటు డి ఎమ్ హెచ్ ఓ తో సమీక్షించడం జరిగింది. ఈ విషయంలో మా యొక్క విన్నపాన్ని,వాదనలను ఏకీభవించినటువంటి డిఎంహెచ్ఓ గారు ఈనెల 30 నాటికి బాధితులైనటువంటి గొల్లపల్లి మాతయ్య మరియు నలుగురికి న్యాయం చేసి వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల పట్ల సత్వర పరిష్కారానికి మార్గం చూపుతానని హామీ ఇవ్వడం జరిగింది డిఎంహెచ్వో హామీ మేరకు ప్రభుత్వానికి ఈ 20 రోజుల సమయాన్ని ఇచ్చి ఈ 20 రోజుల సమయంలో మా మాదిగ మేల్ హెల్త్ అసిస్టెంట్లకు వారు ఏదైతే కోరుకున్నారో అదే రెగ్యులర్ విధముగా పోస్టింగ్ మంజూరు చేసి న్యాయం చేయ కపోతే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకెళ్లి న్యాయమైన ప్రజా పోరాటంతో ఎమ్మార్పీఎస్ ముందుకు పోతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ, గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ
ఎమ్ ఎస్ పి రాష్ట్ర నాయకులు బెజవాడ పాపయ్య మాదిగ. ఎమ్ ఇ ఎఫ్ జాతీయ నాయకులు గేరా జానకిమాల, ఎమ్ ఎమ్ ఎస్ నెల్లూరు జిల్లా కన్వీనర్ గౌడ్ పేరు కొండయ్య మాదిగ మంద సుజాత మాదిగ వేగురు వెంకటేశ్వర్లు మాదిగ దర్శకుంట సీనయ్య శివయ్య లక్ష్మయ్య మనోహర్ రామ్మోహన్ అంకయ్య,తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం