మన ధ్యాస ,నెల్లూరు ,నవంబర్ 4: నెల్లూరు నగరం మినర్వా గ్రాండ్ లో నెల్లూరు జిల్లా ఆర్ అండ్ బి ఎస్ .సి ఎం గంగాధర్ పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో విచ్చేసిన అతిధులుమాట్లాడుతూ….. నెల్లూరు జిల్లా ఆర్ అండ్ బి ఎస్ సి ఎస్సీ నిజాయితీతో, నిబద్దతో 39 సంవత్సరాలు పనిచేసే నేడు పదవి విరమణ చేయుచున్న ఎం గంగాధర్ శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని మనస్ఫూర్తితో కోరుతున్నామని అని తెలియజేశారు. అనంతరం ఆర్ అండ్ బి ఎస్సీ ఎం గంగాధర్ మాట్లాడుతూ……. నేను మారుమూల గ్రామం లో పుట్టి కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చి నందుకు చాలా సంతోషంగా ఉంది . నా ఉద్యోగ సర్వీసులో నాకు సహకారం అందించిన తోటి ఉద్యోగులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ పదవి విరమణ వేడుకలకు విచ్చేసిన అతిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎస్సీ గంగాధరను శాలువతో వచ్చిన అతిథులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగులు ఎస్సీ గంగాధర్ బందు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.












