మన ధ్యాస ,నిజాంసాగర్ ( జుక్కల్ )నవంబర్ 3, నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ ఫ్యాక్టరీ లో సోమవారం కెన్ క్యారియర్ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.వైస్ ప్రెసిడెంట్
వేణుగోపాల్ రావు,కెన్ జనరల్ మేనేజర్ వెంగల్ రెడ్డి, సిడిసి చైర్మన్ ఎండి.షాదుల్లా, బోధన్ కెన్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట రవి కెన్ క్యారియర్ లో చెరుకు వేసి గనుగను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కామారెడ్డి,సంగారెడ్డి,మెదక్ జిల్లాలోని 15 మండలాలలోని 2,216 మంది రైతులు 3,989 హెక్టార్లలో చెరుకు పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. 2025-2026 సీజన్ కు గాను 4.25 మెట్రిక్ టన్నుల చెరుకు గనుగ చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నామన్నారు. చేస్తుందన్నారు.2025-2026 సంవత్సరంకుగాను జిఎస్ఆర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎకరానికి రెండున్నర టన్నుల చెరుకు విత్తనం ఉచితంగా ఇస్తుందన్నారు.








