

బంగారుపాళ్యం డిసెంబర్ 6 మన న్యూస్
.చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం నలగాంపల్లి పంచాయతీ బిసి కాలనీలో శుక్రవారం రాత్రి బిసి యువ నాయకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగని రీతిలో మండల టిడిపి అధ్యక్షుడు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా అంగరంగ వైభావంగా నిర్వహించారు.గ్రామంలో కోలాటాలు, మేళతాలతో జయప్రకాష్ నాయుడు దంపతులకు పూలు చల్లుతూ స్వాగతం పలికి భారీ కేకు కోసి అందరికి తినిపించారు. ఈ కార్యక్రమంలో బుసా నాగరాజ గౌడ్,జనార్దన్ గౌడ్,ఎన్.పి.రాధాకృష్ణ,ఎన్.పి.శ్యామల,లోకయ్య,శివ,దినేష్,దాము,సురేష్,వెంకట్, రెడ్డి,కాలనీలోని యువత, మహిళలు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.