మన ధ్యాస ,నెల్లూరు, అక్టోబర్ 31: :నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న జోష్ రియల్ ఎస్టేట్ సంస్థ ఆఫీసు నందు శుక్రవారం నూతన లేఅవుట్ బ్రోచర్ని విడుదల చేశారు. ద్వారకామై 2 అనే పేరుతో కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గ్రామంలో లేఔట్ లో సరసమైన ధరలకే ప్లాట్లను ప్రజలకు అందించడం జరుగుతుందని సంస్థ వారు తెలిపారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి పట్టాభి చేతుల మీదుగా బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ ఈశ్వర్ ప్రకాష్ అక్కడికి వచ్చిన అతిథులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని రియల్ ఎస్టేట్ మీడియేటర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.









