మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ఎంపీడీఓ గా డి.శివ కృష్ణ మంగళవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఎంపీవో అనిత,మండల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే తనప్రధానలక్ష్యమని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉండి,ప్రతి గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షిస్తానని చెప్పారు.అభివృద్ధి,పారదర్శకత, ప్రజాసేవ పట్ల కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.






