ఉదయగిరి, కలిగిరి పట్టణాల్లో ఉచిత భోజన శిబిరాలు — ప్రజలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
ఉదయగిరి అక్టోబర్ 26 :(మన ద్యాస న్యూస్)://
ఉదయగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద మరియు కలిగిరి పట్టణంలోని ఎం.ఆర్.ఓ కార్యాలయం సమీపంలో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం యూ.ఎస్.ఏ అట్లాంటా వాస్తవ్యులు కీ||శే|| మిక్కిలినేని గౌతమి జయంతిని పురస్కరించుకుని, ఆమె జ్ఞాపకార్థంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది.సామాజిక సేవా స్పూర్తితో, నిరుపేదలు మరియు అవసరమైన వారికి ఉచిత భోజనం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో ప్రజలు, స్థానికులు, మహిళలు, పిల్లలు పాల్గొని భోజనం స్వీకరించారు.ఈ మహోత్సవానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరై, స్వయంగా భోజనం వడ్డించి, ప్రజలతో కలసి భోజనం చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను పెంపొందిస్తాయి. మిక్కిలినేని గౌతమి జ్ఞాపకార్థం ఇలాంటి సేవలు నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమైన విషయం,” అని తెలిపారు.కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నిరంతరం ప్రజలకు సేవచేస్తూ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మరియు వాలంటీర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.









