యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 24:
యాదమరి మండలం జోడి చింతల గ్రామంలోని సుచి కార్యాలయం ప్రాంగణంలో చిత్తూరు సిఎంసి హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత జనరల్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుచి స్వచ్ఛంద సంస్థ అధినేతలు పాల్ విజయ్ కుమార్, గ్లోరీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఎంసి హాస్పిటల్ వైద్యాధికారులు ప్రజలకు వివిధ రకాల వ్యాధులపై ఉచితంగా చికిత్స అందించారు. సుమారు 75 మంది ఈ శిబిరంలో పాల్గొని వైద్య సలహాలు పొందగా, 20 మందిని సిఎంసి ఆసుపత్రికి రిఫర్ చేశారు. అవసరమైన మందులు, మాత్రలు రాయితీతో అందజేయడం జరిగింది. శిబిరంలో డాక్టర్ చరిల్ లిడియా జాన్, నర్సులు హెలెన్ మెటల్డ, హర్ష వర్గీస్, అలీన మనోజ్, సర్లిసిపోర పాల్గొన్నారు. అలాగే సుచి సంస్థ సిబ్బంది సాంసన్, ఆనంద కుమార్, ధనలక్ష్మి, జాన్సన్, వరదరాజులు, జాకబ్, మనీ, డి.చిన్నయ్య సహకరించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇలాంటి శిబిరాలు తరచుగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.







