మన ధ్యాస, మొహమ్మద్‌నగర్: మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామ గేటు నుంచి హెడ్స్లూస్ వరకు ఇరుప్రక్కల ముళ్ల పొదలు విస్తరించి పెరిగాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు వెళ్లే సమయంలో అటు ఇటు నుంచి వచ్చే వారికి ముళ్ల పొదలు తగలడంతో గాయాలపాలవుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
ప్రతిసారి ఈ రహదారిపై ముళ్ల పొదలు పెరిగి, గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మార్గం గుండా హెడ్ ల్యూస్ జల విద్యుత్ కేంద్రానికి ప్రతిరోజు వందలాది మంది రాకపోకలు కొనసాగిస్తుంటారు. వెంటనే నీటిపారుదల శాఖ అధికారులు చర్యలు తీసుకుని ముళ్ల పొదలను తొలగించాలని ప్రజలు వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.








