

తవణంపల్లి డిసెంబర్ 5 మన న్యూస్
తవణంపల్లి మండలంలోని మేజర్ పంచాయతీ అరగొండ గ్రామంలో బుధ గురువారాల్లో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మండల టిడిపి నాయకులు ఏ రఘుపతి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పరిధిలోని పై మాగం 1, పైభాగం 2,గ్రామాలలో బుధ,గురువారాలలో సభ్యత కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రామాలలో ఏ రఘుపతి తన సొంత నిధులతో సుమారు 300 సభ్యత్వాన్ని నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఏ రఘుపతి విలేకరులతో మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ ప్రతిష్టలలో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా 300 పైగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ రఘుపతి,నిశాంత్, చాంద్ బాషా, మహేష్,వంశీ, ఏ రంజిత్,ప్రకాష్ తులసి, పైమాగం 2 కు చెందిన గాంధీ, వినాయక తదితరులు పాల్గొన్నారు