ప్రజల అవసరాల కోసం అటవీశాఖ పనిచేయాలి……. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కీలకమైన కండలేరు స్పిల్ వే కాలువల విషయంలో అభ్యంతరాలు తగదు

మన ధ్యాస ,పొదలకూరు ,అక్టోబర్ 23: నెల్లూరు జిల్లా ,కండలేరు జలాశయం వద్ద స్పిల్ వేను గురువారం పరిశీలించిన సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డ్యాం ఈఈ గజేంద్రరెడ్డి, ఎడమ కాలువ ఈఈ అనిల్ కుమార్ రెడ్డి, డీఈ శివారెడ్డి, తహసీల్దార్ శివకృష్ణ తదితరులతో వరద పరిస్థితిపై చర్చించిన సోమిరెడ్డి.స్పిల్ వే వద్ద అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్ హిమాన్షు శుక్లతో ఫోన్ లో చర్చ. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ …….భారీ వర్షాలతో కండలేరు జలాశయం నిండుకుండలా మారింది అని అన్నారు.స్పిల్ వే లో మూడు గేట్లు ఉన్నాయి…వీటి ద్వారా 50 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసే ఏర్పాటు ఉంది అని అన్నారు.68 టీఎంసీల సామర్థ్యం కలిగిన కండలేరులో ఇప్పటికే నిల్వ 60 టీఎంసీలు దాటింది అని అన్నారు.పరివాహక ప్రాంతంలో భారీవర్షాలు కొనసాగితే స్పిల్ వే గేట్లు తెరవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు.గేట్లు తెరిస్తే వరద జలాలు ఇక్కడి నుంచి 14 కిలోమీటర్లు మేర ప్రవహించి డేగపూడి వద్ద కండలేరు వాగులో కలవాలి అని అన్నారు.స్పిల్ వే దిగువ ప్రాంతంలో 560 మీటర్ల మేర అటవీ భూమి ఉందని కాలువ తవ్వేందుకు అటవీశాఖ అభ్యంతరం చెబుతోంది అని అన్నారు.ఇప్పటి వరకు జరిగిన పనులు కాకుండా వరద నీరు సాఫీగా వెళ్లి కండలేరు వాగులో కలిసేందుకు కొత్తగా రూ.95 కోట్లతో పనులు చేపట్టాల్సివుంది అని అన్నారు.ఇది చాలా అత్యవసరమైన పని..వైసీపీ ఐదేళ్ల పాలనలో ఈ అంశాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అని అన్నారు.కీలకమైన స్పిల్ వే కాలువల పనులతో పాటు అటవీ అనుమతుల సాధనను విస్మరించి కండలేరు ఎడమ కాలువ లైనింగ్ చేయించారు అని అన్నారు.కండలేరు ఎడమకాలువకు లైనింగ్ చేయించమని ఏ రైతులు అడిగారు..మొదటి ప్రాధాన్యత స్పిల్ వే వద్ద కాలువల తవ్వకానికి ఇవ్వాలి కదా అని అన్నారు.నిన్న పెంచలకోన ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగివుంటే పరిస్థితి ఏంది..ఎన్ని గ్రామాలు ప్రమాదానికి గురవుతాయో తెలుసా అని అన్నారు.ప్రజలకు ఏది అవసరమో తెలుసుకోకుండా కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యమివ్వడం దుర్మార్గం అని అన్నారు.వైసీపీ హయాంలో ఇరిగేషన్, వ్యవసాయంతో పాటు కీలకమైన శాఖలను మూతేశారు..వారికి డబ్బులు వచ్చే శాఖలకే పెద్దపీట వేశారు అని అన్నారు.ప్రస్తుత పరిస్థితి జిల్లా కలెక్టర్ కూడా అర్థం చేసుకున్నారు…రూ.95 కోట్ల ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాను అని అన్నారు.అటవీశాఖకు 560 మీటర్ల మేర భూమికి ప్రత్యామ్నాయంగా ఉదయగిరిలో భూములు చూపించారు అని అన్నారు.ప్రజావసరాల నేపథ్యంలో అటవీశాఖ కొన్ని వెసులబాట్లు ఇవ్వాలి. ప్రతి విషయంలో నియమ, నిబంధనల పేరుతో అడ్డు తగలడం సరికాదు అని అన్నారు.అడవిలో ఎర్రచందనం చెట్లను నరికేవారిని పట్టుకుని జైళ్లలో వేయండి. కానీ రైతులు, ప్రజల ప్రయోజనాల విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించాలి అని అన్నారు.స్పిల్ వే వద్ద 560 మీటర్లలో కాలువ తవ్వితే అడవి మూతపడిపోతుందా అని అన్నారు.కాలువ తవ్వితే నీళ్లు సాఫీగా దిగువకు వెళ్లిపోతాయి..లేదంటే అటవీ ప్రాంతం కూడా ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది అని అన్నారు.ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడటమే గాక, రైతుల పొలాలు కూడా మునిగిపోయే పరిస్థితి అని అన్నారు.పులికల్లు, పర్వతాపురం, అంకుపల్లి, వావింటపర్తి తదితర గ్రామాలు ప్రమాదంలో పడతాయి అని అన్నారు.డీఎఫ్ఓల నుంచి రాష్ట్ర ఉన్నతాధికారుల వరకు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని కాలువ తవ్వకానికి అనుమతులు ఇవ్వాలి అని అన్నారు.జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అటవీ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఇక్కడి ప్రజల అవసరాలను సీఎంకు వివరించి రూ.95 కోట్లు మంజూరు చేయిస్తాం అని అన్నారు.

  • Related Posts

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 2 views
    ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    • By RAHEEM
    • October 29, 2025
    • 4 views
    ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    • By RAHEEM
    • October 29, 2025
    • 3 views
    దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 8 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్