విద్యుత్, టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో సమీక్ష సమావేశం ఆధారాలతో సహా బయటపెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
మన ధ్యాస, నెల్లూరు రూరల్, అక్టోబర్ 23:పేద మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం వేధిస్తున్న అవినీతి అధికారులు సిబ్బంది పట్ల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో ఆయన విద్యుత్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన అనేక అంశాల గురించి సంబంధిత శాఖల అధికారుల సిబ్బందిని ప్రశ్నించారు. మధ్యతరగతి ప్రజలను లంచాల కోసం ఎందుకు వేధిస్తున్నారని నిలదీశారు. మీ వైఖరి మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో ఆధారాలతో సహా అయిన బయట పెట్టడంతో కొంతమంది అధికారులు, సిబ్బంది గుటకలు మింగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు ఈ తప్పు మరోసారి చేయమని దీనిని సరిదిద్దుకుంటామని ఎమ్మెల్యే ముందు చెప్పారు.ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…… పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదని, రోజువారి కష్టం చేసేవారిని కూడా లంచాల కోసం వేధించడం సరికాదన్నారు. తనకు వచ్చిన ఫిర్యాదులు ఆధారాలను లెటర్ రూపంలో పెడితే మీ ఉద్యోగాలు కూడా ఉండమని హెచ్చరించారు. అలాగే మీడియా కూడా ఇస్తే మీ భవిష్యత్తు ఏమవుతుందని నిలదీశారు. తొలి హెచ్చరికగా జాగ్రత్తగా పని చేసుకోవాలని, ఇవి పునరావృత్తమైతే అంతే కఠినంగా చర్యలు ఉంటాయన్నారు. మొత్తానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం వాడి వేడిగా సాగింది.









