బుచ్చిరెడ్డిపాలెం, అక్టోబర్ 22 (మన ధ్యాస న్యూస్)
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని పైడా రామయ్య కళ్యాణ మండపం వీధిలో నివసించిన, బుచ్చిరెడ్డిపాలెం డి.ఎల్.ఎన్.ఆర్. ప్రభుత్వ హైస్కూల్‌లో పి.ఇ.టి. మాస్టర్‌గా సేవలందించిన మన్నెం నరసారెడ్డి (మన్నెం మధుసూదన్ రెడ్డి తండ్రి) ఈ రోజు అకాల మరణం చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వాల్ల స్వగృహానికి వెళ్లి మన్నెం నరసారెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, మన్నెం నరసారెడ్డి సమాజ సేవా భావంతో, క్రమశిక్షణతో జీవించిన వ్యక్తి అని, ఉపాధ్యాయ వృత్తి ద్వారా అనేకమంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన గొప్ప గురువుగా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. తన వృత్తి జీవితంలో విద్యార్థుల అభివృద్ధి కోసం, పాఠశాల పురోగతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అకస్మాత్తుగా ఆయన మరణం కుటుంబానికి మాత్రమే కాకుండా, విద్యావేత్తల వర్గానికి తీరని లోటు అని ఎమ్మెల్యే సురేష్ అన్నారు.మన్నెం నరసారెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, భగవంతుడు వారికి మనోధైర్యం ప్రసాదించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మనసారా ప్రార్థించారు.









