మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్‌నగర్ మండల కేంద్రంలోని పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎస్‌ఐ శివకుమార్ సిబ్బందితో కలిసి రైడ్ నిర్వహించారు.ఈ దాడిలో పేకాటలో పాల్గొంటున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని,వారి వద్ద నుండి రూ.41,410/- నగదు, 52 పేకముక్కలు,7 మొబైల్ ఫోన్లు, 3 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఐ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ శివకుమార్ మాట్లాడుతూ..జూదం,పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయి.ఎవరికీ ఉపేక్ష ఉండదు అని హెచ్చరించారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.








