మాలేపాటి భానుచందర్ అకాల మరణంపై శోకసంద్రంలో దగదర్తి – ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ..!
దగదర్తి, అక్టోబర్ 19 :(మన ధ్యాస న్యూస్ )://

దగదర్తి మండలానికి చెందిన ప్రముఖ తెలుగు దేశం పార్టీ యువ నాయకుడు మాలేపాటి భానుచందర్ (మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్రనాయుడు కుమారుడు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు అన్న కుమారుడు) ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు.ఆయన అకాల మరణం స్థానిక ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులను తీవ్ర విషాదంలో ముంచేసింది.ఈ వార్త తెలిసిన వెంటనే ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వ్యక్తిగతంగా దగదర్తికి చేరుకుని, భానుచందర్ వారి పార్థివదేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పిస్తూ, “భానుచందర్ వంటి యువ నాయకుడు పార్టీకి, ప్రాంతానికి, సమాజానికి గొప్ప ఆస్తి. ఆయన అకాల మరణం తీరని లోటు” అని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల కన్వీనర్ చింతనబోయిన బయన్న, వింజమూరు మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, కలిగిరి మండల కన్వీనర్ బిజ్జం కృష్ణారెడ్డి, కలిగిరి మండల మాజీ ఎంపీపీ మద్దసాని వెంకటేశ్వర్లు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని రామారావు, మాజీ ఉదయగిరి మండల కన్వీనర్ బొజ్జ నరసింహులు, సీనియర్ నాయకులు ఘంటా నరసింహులు, తిరుపతి నాయుడు, జలదంకి మండల తెలుగు యువత నాయకులు మునగాల తిరుమల రెడ్డి, జలదంకి సొసైటీ చైర్మన్ అప్పలనాయుడు, డైరెక్టర్ మధుసూదన్, మల్లినేని శ్రీనివాసులు నాయుడు, గంట అశోక్, నల్లిపోగు నరసింహులు, చెరుకూరి శ్రీనివాసులు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.









