కావలి, అక్టోబర్ 18 :(మన ధ్యాస న్యూస్)://
నెల్లూరు జిల్లా కావలి పట్టణం నివాసి పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి షేక్.బాబుల్-రమీజా,దంపతులు కుమార్తె చిన్నారి షేక్.సాదియా పుట్టినరోజు సందర్భంగా సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో కావలి పట్టణం శివరామ సుబ్బయ్య గిరిజన కాలనీలోని నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో దాతలు షేక్.బాబుల్ - రమీజ దంపతులు మరియు వారి కుమార్తె చిన్నారి సాదియా,సంస్థ అధ్యక్షుడు సురేంద్ర పాల్గొనడం జరిగింది.దాత కానిస్టేబుల్ షేక్ బాబుల్ మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా వారి పిల్లల పుట్టిన రోజులు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామని తెలిపారు. దీనిలో భాగంగానే నేడు వారి పెద్ద కుమార్తె చిన్నారి షేక్ సాదియా పుట్టినరోజును పురస్కరించుకుని శివరామ సుబ్బయ్య గిరిజన కాలనీలోని పేదలకు భోజనం ప్యాకెట్లు వితరణ చేయడం జరిగిందని తెలిపారు.ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమకు సపోర్ట్ చేస్తున్న సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రకు ధన్యవాదాలు తెలియజేసారు.








