మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) దేశం కానీ దేశంలో ప్రేమించుకొని భారతీయ సంప్రదాయం పద్దతిలో పెళ్లి చేసుకున్న నేపాల్ అమ్మాయి,తెలంగాణ అబ్బాయి పెళ్లివేడుక కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో జరిగింది.మహమ్మద్ నగర్ మండలంలోని తెల్లపూర్ గ్రామానికి చెందిన రవీందర్ గత ఐదు సంవత్సరాలుగా దుబాయ్ లో జాబ్ చేస్తున్నాడు.అక్కడే తన ఆపీస్ లో పనిచేస్తున్న నేపాల్ యువతీతో ప్రేమలో పడ్డాడు.ఇరు కుటుంబాలు వీరి ప్రేమకు ఒప్పుకోవడంతో యువతీ యువకుడు ఇండియాకు వచ్చి గురువారం గ్రామంలో ఘనంగా పెళ్లివేడుక చేసుకున్నారు.నూతన దంపతులనుగ్రామస్తులునాయకులుఆశీర్వదించారు.భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం ఆనందంగా ఉన్నదని పెళ్లి కూతురు సంతోషం వ్యక్తం చేశారు.తిరిగి నెల రోజుల్లో దుబాయ్ వెళ్ళిపోతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.








