

మన న్యూస్: పినపాక, గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను గుర్తించి, ప్రోత్సాహం కల్పించేందుకు సీఎం కప్ ను 36 క్రీడాంశాల్లో మూడు దశల్లో పోటీలు నిర్వహిస్తామన్నారని పినపాక ఎంఈఓ నాగయ్య తెలిపారు. గురువారం పినపాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన వ్యాయామ ఉపాధ్యాయులతో, గ్రామపంచాయతీ సెక్రటరీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, ఎంఈఓ నాగయ్య లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 7 నుంచి సీఎం కప్ జరుగుతుందన్నారన్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో గ్రామస్థాయిలో, 10 నుంచి 12 వరకు మండల, పురపాలిక, 16 నుంచి 21 వరకు జిల్లా, డిసెంబరు 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రథమ స్థానం సాధించిన వారికి బంగారు పతకంతోపాటు వ్యక్తిగత విభాగంలో రూ.20 వేలు, బృందానికి రూ.లక్ష, ద్వితీయ స్థాన పొందిన వారికి వెండి పతకం, వ్యక్తిగత విభాగంలో రూ.15 వేలు, బృందానికి రూ.75 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి కాంస్య పతకం, వ్యక్తిగత విభాగంలో రూ.10 వేలు, బృందానికి రూ.50 వేలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. సీఎం కప్ క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు . గ్రామ, మండల, పురపాలిక స్థాయుల్లో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, యోగా ఉంటాయని, జిల్లా స్థాయిలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖో-ఖో, యోగా, చెస్, బేస్‌బాల్, కిక్‌బాక్సింగ్, సైక్లింగ్, వుషూ, జూడో, స్నూకర్ క్రీడలను నిర్వహిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గల పీడీ లను,పిఈటి లను, గ్రామపంచాయతీ సెక్రటరీలను,ఎంఈఓ,ఎంపీడీవో కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ దిలీప్ ,పిడి వీరన్న,గ్రామపంచాయతీ సెక్రటరీలు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.