యాదమరి, మన ధ్యాస అక్టోబర్ 13: యాదమరి మండల వనరుల కేంద్రంలో ఈ రోజు 2025 ఉపాధ్యాయ నియామక పరీక్ష ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రుక్మణమ్మ మాట్లాడుతూ, యాదమరి మండలానికి ముగ్గురు ఉపాధ్యాయులు నియమితులయ్యారని తెలిపారు. వీరిలో గౌతమి, ఆంగ్ల విభాగంలో పాఠశాల సహాయకురాలు, మధ్య ప్రాథమిక పాఠశాల తెల్లరాళ్లపల్లి, నేతాజీ, తెలుగు విభాగంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, మండల పరిషత్ పాఠశాల ఎం.వి.వై కాలనీ, షేక్ అయూబ్, ఉర్దూ విభాగంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు, మండల పరిషత్ ప్రాథమిక ఉర్దూ పాఠశాల కమ్మపల్లి నూతనంగా నియామకం పొందిన ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, విద్యార్థులను జ్ఞానం మరియు నైపుణ్యాలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు మదన్ మోహన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం పిళ్లె, సర్దార్ తదితరులు పాల్గొని నూతన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు.









