మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సింగరాయకొండలోని శ్రీ విద్యానికేతన్ హై స్కూల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలపై వివక్ష, హింస, బాల్యవివాహాల వలన కలిగే నష్టాలపై అవగాహన కలిగించేందుకు పాఠశాల నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినిల కోసం వ్యాసరచన, వక్తృత్వం, ఏకపాత్రాభినయం, పోస్టర్ మేకింగ్ వంటి పోటీలు నిర్వహించారు.ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థినిలకు హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ సైకం శ్రీ విద్య బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,
“ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడితే వారే సమాజ అభివృద్ధికి మార్గదర్శకులు అవుతారు. ప్రతి ఒక్కరూ బాలికల భద్రత, విద్య, గౌరవం పట్ల బాధ్యత తీసుకోవాలి,” అని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మాజీ ఎంఈఓ కోటపాటి నారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.









