వింజమూరు, అక్టోబర్ 10 :(మన ధ్యాస న్యూస్ ):///
పోషణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వింజమూరు ఐసీడియస్ సీడీపీఓ పద్మజ పేర్కొన్నారు. శుక్రవారం వింజమూరు మండలం లోని గుండెమడకల మెయిన్ అంగన్వాడీ కేంద్రం లో రాష్ట్రీయ పోషణ మాసం మాసోత్సవాలా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సీడీపీఓ పద్మజకుమారి మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు జరిగే 8వ రాష్ట్రీయ పోషణ మాసం మహోత్సవాలా కార్యక్రమం లో భాగంగా పౌష్టిక ఆహారంపై అవగాహన కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల నిండిన నా పిల్లల తల్లులకు పోషకహార ప్రాముఖ్యతను వివరించారు. అలాగే ఐసిడిఎస్ అడిషనల్ సిడిపిఓ వర్మిష్ఠ సూపర్వైజర్ తేజస్వినిలు మాట్లాడుతూ కుటుంబ నిర్వహణలో పురుషుల ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హౌస్ విజిట్ చేసి ఐసిడిఎస్ ద్వారా పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారాలను ఏ విధంగా వాడాలని దానిపై అవగాహన కల్పించారు. బాలామృతం, బాల సంజీవిని కిడ్స్, గుడ్లు, పాలు, క్రమం తప్పకుండా వాడుతూ ఆరోగ్యకరంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాధ, శ్రీదేవి, ప్రకృతి ఎంఎల్ హెచ్ పి నాగమల్లేశ్వరి, ఆశా వర్కర్ లక్ష్మీదేవి, గర్భవతులు, బాలింతలు, అంగన్వాడి హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.








