🔸సేవా పథంలో ముందుకు సాగుతున్న కాకర్ల చారిటబుల్ ట్రస్ట్..!

ఉదయగిరి అక్టోబర్ 10 :(మన ధ్యాస న్యూస్):///
ఉదయగిరి మండలం దాసరిపల్లి పంచాయతీ పరిధిలోని యర్రబల్లికుంట గ్రామానికి చెందిన కేతిబోయిన శ్రీనివాసులు – దొరసానమ్మ దంపతుల కుమార్తె సౌమ్య వివాహ మహోత్సవం ఆనందభరితం గా జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ తమ “కాకర్ల చారిటబుల్ ట్రస్ట్” ద్వారా పెళ్లికానుకగా రూ.10వేల రూపాయలను ట్రస్ట్ ప్రతినిధులు మరియు స్థానిక నాయకుల చేతుల మీదుగా అందజేసి ఎమ్మెల్యే తన హృదయపూర్వక ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తూ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ నిరంతరంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరో మారు స్పష్టం చేశారు.ఉదయగిరి నియోజకవర్గంలో విద్య, ఆరోగ్యం, వివాహము వంటి పలు రంగాలలో సహాయం చేస్తూ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ సామాజిక సేవకు ఆదర్శంగా నిలుస్తోందని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే సురేష్ సేవా తపనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు జల్సా యాదవ్, హరీష్ యాదవ్,స్థానిక టిడిపి నాయకులు పొంగూరు నరేందర్ రెడ్డి, గాడి ప్రభాకర్ రెడ్డి, వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.








