కలిగిరి, అక్టోబర్ 10 :(మన ధ్యాస న్యూస్ )://

కలిగిరి మండలం వెంకన్నపాలెం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మహా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షుడు స్వర్ణ కొండయ్య అంగన్వాడి టీచర్ స్వర్ణ లలితమ్మ అంగన్వాడీ హెల్పర్ స్వర్ణ ప్రభావతి ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యత ముర్రిపాల ఆవశ్యకత చిన్నపిల్లల ఆహారపు అలవాట్లు గురించి మరియు వ్యక్తిగత శుభ్రత ,స్థూల కాయం గర్భవతులకు బాలింతల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు పిల్లలు గర్భిణీలు ఎంపీపీ స్కూల్ హెడ్మాస్టర్ మధుసూదన్ రావు దువ్వూరి మేరీ తదితరులు పాల్గొన్నారు.









