మన ధ్యాస ,కొడవలూరు ,అక్టోబర్ 9 :యల్లాయపాళెం గ్రామంలో సిసి రోడ్డు ప్రారంభోత్సవం. * 15 నెలల వ్యవధిలో యల్లాయపాళెం పంచాయతీలో 1 కోటి 50 లక్షల అభివృద్ధి పనులు :పలెటూళ్ళల్లో పట్టణ స్థాయి మౌళిక వసతులు కల్పించి గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కొడవలూరు మండలం యల్లాయపాళెం గ్రామ పంచాయతీలోని ఎన్టీఆర్ నగర్ లో 11 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం సాయంత్రం పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి స్థానిక టిడిపి నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ నగర్ సమీపంలో చెరువులను తలపిస్తున్న గ్రావెల్ గుంతలకు 3 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రొటెక్షన్ ఫెన్సింగ్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ…… ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్టీఆర్ నగర్ కు వచ్చినప్పుడు గ్రావెల్ గుంతలలో పడి ఇద్దరు చిన్నారులతో పాటు పశువులు కూడా మృతి చెందాయని స్థానికులు చెప్పడంతో చలించి పోయానన్నారు. పిల్లలను ఆడుకునేందుకు బయటకు పంపాలంటేనే తల్లి తండ్రులు భయపడే పరిస్థితి వుండేదన్నారు. ఎన్నికలలో గెలిచాక గ్రావెల్ గుంటలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తానని హామీ యిచ్చానని ఎన్టీఆర్ నగర్ వాసుల ప్రాణాంతకంగా మారిన గ్రావెల్ గుంటలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసాక సంతోషంగా ఉందన్నారు. యల్లాయపాళెం పంచాయతి పరిధిలోని రామాపురం ను ప్రత్యేక పంచాయతీగా అప్ గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 15 నెలలలో దాదాపు 1 కోటి 50 లక్షలతో యల్లాయపాళెం గ్రామ పరిధిలో రోడ్లు, డ్రైన్లు లాంటి మౌలిక వసతులు కల్పించామన్నారు. ఎన్నికల సందర్భంగా యల్లాయ పాళెం గ్రామ అభివృద్ధికి సంబంధించి చేసిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేసుకుంటూ పోతున్నామన్నారు. అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అమలు చేయడం చంద్రబాబు నాయుడు కే సాధ్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చాక 3 వేలు వున్న వృద్ధాప్య పెన్షన్ 4 వేలు, దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు ఏడాదికి ఉచితంగా 3 సిలెండర్లు, అన్నదాత సుఖీభవ, మత్స్యకార సేవలో, తల్లికి వందనం యిలా ఎన్నికలకు ముందు చేసిన హామీలలో 95 శాతం సంక్షేమ పధకాలు అమలు చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలు, విద్యార్థినుల పాలిట స్త్రీశక్తి పేరిట ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణ పధకం ఓ వరమని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అభివర్ణించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో సోదరులు నష్టపోకుండా ప్రతి ఆటో డ్రైవర్ కు ఏడాదికి 15 వేలు ఆర్ధిక సహాయం అందచేశామన్నారు. అధికారంలోనికి వచ్చిన 16 నెలలలో ఒక్క కోవూరు నియోజకవర్గంలోనే సీఎంఆర్ఎఫ్ ద్వారా 362 మంది అనారోగ్య పీడితులకు దాదాపు 4 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన కూటమి ప్రభుత్వం పేదల ఆకాంక్షలు నెరవేర్చే మంచి ప్రభుత్వమన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టి మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు అమరేంద్ర రెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు వెంకటరమణారెడ్డి, సొసైటీ ఛైర్మెన్ ఏకొల్లు వంశిరెడ్డి, ఎంపీటీసీ గరికపాటి రాజా, డిస్ట్రిబ్యూటర్ కమిటి ఉపాధ్యక్షులు జొన్న శివకుమార్ టిడిపి నాయకులు భూలోకం విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.













