

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం : ప్రముఖ సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ఆలమూరు సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం లింగంపర్తి గ్రామంలో ఘంటసాల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలమూరు మాట్లాడుతూ తెలుగు సినీపాటకు ఓ చరిత్రను సృష్టించిన మహాగాయకుడిగా వేల పాటలతో పండితుల నుండి పామరుల దాకా నిత్యం ప్రతి నోట వినిపించి అమృతస్వరం అని అన్నారు. ఘంటసాల గానంలో ప్రతి అక్షరం, ప్రతిపాట గొప్పతనం సంతరించుకుని సంగీతం, స్వరం, శబ్దము ప్రధానంగా సాగిన ఆయన పాటల ప్రహనం అద్వీతీయంగా ఈ శతాబ్ది గాయకుడిగా ఘంటసాల స్వరం ప్రవాహం తెలుగు వారి హృదయాల్లో జీవ నదిగా ప్రహిస్తుంటే ఉంటుందని మరియు ఒక్క భగవద్గీతను ఘంటసాల గొంతులో వినగలడం తెలుగు వారికి భగవంతుని వరప్రసాదం అని అన్నారు. వేల లో పాటలతో , వందల రాగాలతో సంగీతాన్ని రుచి చూపి, తెలుగు సినీ పాటకు అమరత్వాన్ని ప్రసాదించి, చరిత్ర సృష్టించారని అన్నారు. తెలుగు పాట చరిత్రను , పలు సినిమాల్లో ఘనత కెక్కిన పాటలను, గాయకులను, సంగీత దర్శకుల్ని పరిచయం చేస్తూరు ఈ కార్యక్రమంలో మాటూరి సూరిబాబు, చెదల వీరబాబు, వల్లమారెడ్డి కొండయ్య, వాగు బాబులు, కప్పల వెంకటస్వామి, పలువురు ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు.