మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా స్థాయిలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC–SHAR), ISRO ఆధ్వర్యంలో World Space Week సందర్భంగా అక్టోబర్ 8న నిర్వహించిన డ్రాయింగ్ పోటీలలో సింగరాయకొండలోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.ఈ పోటీలలో మొత్తం ఏడు మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో విజయం సాధించి పాఠశాలకి గౌరవం తీసుకువచ్చారు.🏆 విజేతల జాబితా:ప్రథమ స్థానం: A. చరణ్ సాయి (3వ తరగతి), P. రీతిహాన్ అద్విక్ (1వ తరగతి)ద్వితీయ స్థానం: Ch. సహస్ర (5వ తరగతి), P. జోషిక (4వ తరగతి), P. విహాన్ (2వ తరగతి)తృతీయ స్థానం: G. జాన్విక (1వ తరగతి), Y. సమిత్ (1వ తరగతి)ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డా. గీతా రాణి మాట్లాడుతూ, “విభిన్న కేటగిరీల్లో విజయం సాధించిన విద్యార్థుల్లో 40% మంది స్మార్ట్ జెన్ విద్యార్థులే ఉండటం గర్వకారణం. విద్యార్థులలో సృజనాత్మకత, కళా నైపుణ్యాలు, సామాజిక అవగాహన పెంపొందించడానికి మేము నిరంతరం ప్రోత్సహిస్తున్నాము,” అని తెలిపారు.విజేతలను పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు అభినందించారు.









