మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన 69వ స్కూల్ గేమ్స్ స్కేటింగ్ సెలక్షన్ పోటీలలో సింగరాయకొండకు చెందిన “స్మార్ట్ జన్ గ్లోబల్ స్కూల్” విద్యార్థి దక్ష బక్షి ప్రావీణ్యం చూపి జిల్లా స్థాయిలో 2వ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో దక్ష బక్షికి ఘనంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ డా. గీతా రాణి మాట్లాడుతూ,
“దక్ష స్కేటింగ్‌తో పాటు కరాటేలో కూడా ప్రతిభ కనబరుస్తున్నాడు. చదువులోనూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు. నేటి విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా తమ ప్రతిభను చాటేలా మేము నిరంతరం ప్రోత్సహిస్తున్నాం,” అని పేర్కొన్నారు.పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు దక్ష బక్షిని అభినందించి, రాష్ట్ర స్థాయిలో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.









