మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.ఉదయం 7.30 గంటలకు మెట్ల మార్గం వద్ద నుండి ప్రారంభమైన గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొని “జై నరసింహ” నినాదాలతో గిరిప్రదక్షిణ పూర్తిచేశారు.భక్తులు గిరిప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.







