మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ రద్దు అవుతుంది : వజ్రాల చంద్రశేఖర్

తిరుపతి, మన ధ్యాస, అక్టోబర్ 5:
మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ హక్కులు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయని న్యాయ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వజ్రాల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఆదివారం తిరుపతిలోని సరస్వతీ శిశు మందిరంలో జరిగిన హిందూ ఉపాధ్యాయ సమితి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ – “మన సమాజంలోని కొందరు వ్యక్తులు ఇతర మతంలోకి మారినా దానిని దాచిపెట్టి ఎస్సీ రిజర్వేషన్ కింద లభించే సౌకర్యాలు, ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందుతున్నారు. ఇది చట్టవిరుద్ధం. వీరిపై ఆధారాలతో కోర్టులో కేసులు వేస్తే ఆ రిజర్వేషన్ రద్దవుతుంది” అని తెలిపారు.సమావేశానికి అధ్యక్షత వహించిన హిందూ ఉపాధ్యాయ సమితి జాతీయ అధ్యక్షుడు డేగల రమేష్ మాట్లాడుతూ, “మతం మారి పదవులు, ఉద్యోగాలు పొందుతున్న వారి వల్ల నిజమైన హిందూ దళితులు నష్టపోతున్నారు. దీని మీద జాతీయ స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది” అని పేర్కొన్నారు.సామాజిక కార్యకర్త మిట్టపల్లి సతీష్ రెడ్డి మాట్లాడుతూ – “హిందూ దళితుల హక్కుల రక్షణ కోసం నేను జి.డి. నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్‌పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాను. ఇది కేవలం ఒకరి మీద మాత్రమే కాదు, వ్యవస్థలో నెలకొన్న లోపాలపై పోరాటం” అని వివరించారు.సమావేశంలో పలువురు పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ కింద ఎమ్మెల్యేలు అయిన వారిలో 21 మంది క్రైస్తవ మతం స్వీకరించారని ఆరోపించారు. టిటిడిలో కూడా అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని వెంటనే తొలగించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ రమాదేవి, హిందూ ధర్మ పోరాట నేత కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం