

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో మండలానికి సంబంధించిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ ,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లబ్ధిదారులకు అందజేశారు.అలాగే పెద్ద కొడప్గల్ మండలం కస్లబాద్ గ్రామానికి చెందిన లబ్దిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల చెక్కులు అందజేశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..ప్రజా ప్రభుత్వం ఏర్పడి విజవంతంగా సంవత్సరం పూర్తి అయ్యిందని అన్నారు.పేద ప్రజలు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగిందని చెప్పారు.ఈ ఏడాది కాలంలో జుక్కల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అదేవిధంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు ధీటుగా జుక్కల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని అన్నారు.జుక్కల్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానన్నారు.వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత బిచ్కుంద మున్సిపాలిటీ ప్రకటన వెలువడుతుందని చెప్పారు..అదేవిధంగా బిచ్కుంద చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని తెలియజేశారు. మద్నూర్ నుండి రుద్రూర్ మీదగా బోధన్ వరకు ఎన్ఏచ్ 161 బీబీ నేషనల్ హైవే నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జుక్కల్ నియోజకవర్గాన్ని రెవిన్యూ డివిజన్ గా అప్ గ్రేడ్ చేస్తామని అన్నారు.లెండి, నాగమడుగు ప్రాజెక్టులు ఏడాది కాలంలో పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందిస్తామని పునరుద్ఘాటించారు..ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తదితరులున్నారు.
