రైతు రాజ్యమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ద్వేయం

కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల పేదలకు న్యాయం జరుగుతుంది. ఘనంగా నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం…

పినపాక నియోజకవర్గం, మన న్యూస్:- బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సంబరాలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు అభిమాన నేత పాయం వెంకటేశ్వర్లు బాణసంచా కాల్చి భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన మండల కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు… ఈ సందర్భంగా నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, రైతు బాంధవుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు 1,00,00,000 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు..అనంతరం వారు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, రైతు రాజ్యమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలనలోనే రైతులకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంది అని అన్నారు…అందరి కష్టంతో ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేశామని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.. ప్రజా ప్రభుత్వం ఏర్పాటుఅయి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు..గత బిఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలతో దొంగ హామీలతో తెలంగాణ ప్రజలందరినీ మోసం చేశారని మండిపడ్డారు.. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు..ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్నిదని కనుకనే ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు..తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 గ్యాస్ సిలిండర్, రైతుల ఏక కాలంలో 2 లక్షల రుణమాఫీ, వరి ధాన్యానికి కింటాక్ 500 రూపాయలు బోనస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు వరకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు పథకాలను అమలు చేశామని, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళలకు నెలకు 2500 రూపాయలు ఆర్థిక సహాయం, వృద్ధులకి 4000 రూపాయలు నెలవారి పింఛను, అర్హులైన వారికి కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం పథకాల అమలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు..తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అభివృద్ధి ఇస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓరవలేక బిఆర్ఎస్ నాయకులు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పార్టీపై నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు..పినపాక నియోజకవర్గంలో ఈ ఏడాదిలోనే ఏడు మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను పథకాలను ప్రజలకు అందజేయడం జరిగిందని పినపాక నియోజకవర్గన్ని రాష్ట్రం లోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతనని తెలిపారు.. అదేవిధంగా మండలంలో ఉన్న 16 పంచాయతీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇస్తూ, ఇక్కడ కూడా మండల ప్రజలకు తన జీవిత ఆశయం అయినా పులుపు బొంత ప్రాజెక్టుని పూర్తి చేస్తానని మాట ఇచ్చారు.. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పోడుభూమి పట్టాలు ఇస్తామని భరోసా కల్పించారు.. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని ప్రతి ఒక్కరికి పార్టీలో గౌరవం దక్కుతుందని, పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పంచాయతీని గెలిపించుకోవడం కోసం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయకేతనం ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉండాలని ఎటువంటి సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకురావాలని తెలిపారు..చివరగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించి మరొకసారి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు తోలెం నాగేశ్వరరావు, పోలేబోయిన శ్రీవాణి తిరుపతయ్య, వట్టం సమ్మక్క, కుంజ వసంతరావు, మోకాళ్ళ పాపారావు, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకటరత్నమ్మ, మండల నాయకులు ఎర్ర సురేష్, మండల కార్యదర్శి షేక్ రఫీ సీనియర్ నాయకులు ఎట్టి నరసయ్య, వాసిరెడ్డి నేతాజీ, కొర్స బుచ్చయ్య,జట్ల సత్యం,మండల నాయకులు జలగం కృష్ణ, బరపటి వెంకన్న , పడిగా సమ్మయ్య,అత్తే సారయ్య,కోరం వెంకటేశ్వర్లు,వట్టం చుక్కయ్య, దొంతు మల్లయ్య, గాంధర్ల రామనాథం, కార్యకర్తలు,మహిళలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా