నూతన మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలి : ఎస్‌టి యూ డిమాండ్

గుడిపాల మన ధ్యాస సెప్టెంబర్-16 చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని జెడ్‌పి హెచ్‌ఎస్ నరహరి పేట, శ్రీరంగంపల్లి, బొమ్మసముద్రం, కమ్మతిమ్మపల్లి తదితర పాఠశాలల్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన నూతన మూల్యాంకన విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆచరణ సాధ్యం కానిది అని అన్నారు. ఎక్కువ సమయం పాఠ్యాంశాల బోధనకు కాకుండా, మూల్యాంకన పుస్తకాల నింపే పనిలోనే వృథా అవుతుందని, దీనివల్ల సకాలంలో పాఠ్యక్రమం పూర్తి చేయలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కావున పాత మూల్యాంకన విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిలను దశల వారీగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాలని, సరెండర్ సెలవు నగదు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డి.ఏ.ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా మహిళా కార్యదర్శి రాధాకుమారి, సంఘ నాయకులు గుణశేఖర్, సుబ్రహ్మణ్యం పిళ్లె, మునస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండ జడ్పీ హైస్కూల్ విద్యార్థులు జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.మంగళవారం ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి.హెచ్. పద్మజ ప్రకటించారు. విశాఖపట్నంలో జరిగిన 3వ ఆంధ్రప్రదేశ్…

పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా వ్యవసాయ అభివృద్ధి అధికారి ( ఏడిఏ) నిర్మల మేడం రైతులకు, కౌలుదారులకు ‘అన్నదాత సుఖీభవ’…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 16, 2025
  • 2 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు పాత సింగరాయకొండ హైస్కూల్ విద్యార్థులు

పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం

  • By JALAIAH
  • September 16, 2025
  • 2 views
పాత సింగరాయకొండలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం

9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల

  • By RAHEEM
  • September 16, 2025
  • 4 views
9 వరద గేట్లను ఎత్తి వేత… దిగువకు 61 వేల 542 క్యూసెక్కుల నీటిని విడుదల

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మోబిలిటీ లిమిటెడ్ ఆల్ న్యూ ఎల్ట్రా సిటీ XTRA ఆటో …..టెక్నాలజీ లేటెస్ట్, ట్రస్ట్ హైయెస్ట్

ఓజోన్ పొర పరిరక్షణ అందరి భాద్యత : ప్రిన్సిపల్

ఓజోన్ పొర పరిరక్షణ అందరి భాద్యత : ప్రిన్సిపల్

శ్రీబాగ్ ఒప్పందం అమలు కోరుతూ కర్నూలులో న్యాయవాదుల నిరసన

శ్రీబాగ్ ఒప్పందం అమలు కోరుతూ కర్నూలులో న్యాయవాదుల నిరసన