

వింజమూరు : (మన ద్యాస న్యూస్) సెప్టెంబర్ 14 :////
వింజమూరు లోని స్థానిక యుటిఎఫ్ కార్యాలయం నందు యుటిఎఫ్ నాయకులు చంచల బాబు ఆధ్వర్యంలో రణబేరి రణభేరి ప్రచార యాత్రత్సవం గురించి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ మాట్లాడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాలు జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాలు ప్రజలకు అందడానికి వారదులైన ఉద్యోగ ఉపాధ్యాయులను విస్మరించిందని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతి శర్మ పేర్కొన్నారు. అనంతరం స్థానిక యుటిఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో యుటిఎఫ్ రణభేరి పోస్టర్ను ఆవిష్కరిస్తూ కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతో నష్టపోయారు అన్నారు. ఈ ప్రభుత్వం సైతం ఏర్పడి 14 నెలలు పూర్తయిన పిఆర్సి డి ఏ ఐ ఆర్ తదితర సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని అన్నారు. అలాగే యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 17వ తేదీన వింజమూరులో చేపట్టే రణభేరి ప్రచార యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ వెంకటేశ్వర రెడ్డి,వీరాంజనేయులు, పరమేశ్వర రావు, మాల్యాద్రి,మీరావలి,నాగేశ్వరరావు,సుబ్బారావు,తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.